728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
August 25, 2020

ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం

విశాఖపట్నం:
🔷 ఉత్తర బంగాళాఖాతం ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడింది.

🔷 రానున్న రెండు రోజుల్లో ఇది బలపడి తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉంది.

🔷 దీనికి అనుబంధంగా అదే ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.

🔷 మరోవైపు ఉత్తర-దక్షిణ ద్రోణి రాయలసీమ నుంచి దక్షిణ కోస్తా మీదుగా మధ్య తమిళనాడు వరకు కిలోమీటరున్నర ఎత్తులో ఏర్పడింది.

🔷 వీటి ప్రభావంతో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి.

🔷 మంగళ, బుధవారాల్లో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

🔷 దక్షిణకోస్తా, రాయలసీమల్లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.

🔷 కాగా సోమవారం కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల ఎండ తీవ్రత సాధారణం కంటే 2-3 డిగ్రీలు ఎక్కువగా నమోదైంది.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం Rating: 5 Reviewed By: NEWS UPDATE