728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
August 11, 2020

వెంటిలేటర్‌పై మాజీ రాష్ట్రపతి

న్యూఢిల్లీ:
★ మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి సోమవారం బ్రెయిన్‌ సర్జరీ జరిగింది.

★ మెదడులో ఒకచోట రక్తం గడ్డకట్టడంతో ఆపరేషన్‌ చేసి దాన్ని తొలగించారు.

★ అనారోగ్యానికి గురైన 84 ఏళ్ల ప్రణబ్‌ డాక్టర్ల సూచన మేరకు సోమవారం న్యూఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్‌ అండ్‌ రిఫరల్‌ ఆస్పత్రిలో చేరారు.

★ శస్త్ర చికిత్స నిర్వహించే ముందు చేసిన పరీక్షల్లో ఆయనకు కరోనా సోకినట్లు తేలింది.

★ ‘ప్రణబ్‌కు బ్రెయిన్‌ క్లాట్‌ను తొలగించేందుకు శస్త్రచికిత్స జరిగింది. ఆయన పరిస్థితి కాస్త ఆందోళనకరంగా ఉంది. వెంటిలేటర్‌పై ఉన్నారు’ అని విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి.

★ కీలక అవయవాల పనితీరు నిలకడగా ఉందని, నిపుణులైన వైద్య బృందం ఆయన్ను నిరంతరం పర్యవేక్షిస్తోందని తెలిపాయి.

దాదాకు కరోనా పాజిటివ్‌..
★మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ (84) కోవిడ్‌–19 బారిన పడ్డారు.

★ ఈ విషయాన్ని సోమవారం ఆయనే స్వయంగా ట్వీట్‌ ద్వారా వెల్లడించారు.

★ గత వారంలో తనను సంప్రదించిన వారందరూ స్వీయ నిర్బంధంలోకి వెళ్లడం లేదా కోవిడ్‌–19 పరీక్షలు చేయించుకోవడమో చేయాలని, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత కూడా అయిన ఆయన విజ్ఞప్తి చేశారు.

★ 2012–17 మధ్యకాలంలో ప్రణబ్‌ రాష్ట్రపతిగా వ్యవహరించిన విషయం తెలిసిందే.

★ రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఆర్‌ఆర్‌ ఆస్పత్రికి వెళ్లి ప్రణబ్‌ ఆరోగ్య పరిస్థితిపై ఆరాతీశారు.

★ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్, ఆయన కూతురు షర్మిష్టకు ఫోన్‌ చేసి ప్రణబ్‌ ఆరోగ్యం గురించి వాకబు చేశారు.

★ కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ, అశోక్‌ గహ్లోత్, పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, కేంద్ర మంతి పీయూష్‌ గోయల్‌, టీడీపీ అధినేత చంద్రబాబు తదితర నేతలు మాజీ రాష్ట్రపతికి త్వరగా స్వస్థత చేకూరాలని ఆకాంక్షించారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: వెంటిలేటర్‌పై మాజీ రాష్ట్రపతి Rating: 5 Reviewed By: NEWS UPDATE