728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
August 13, 2020

రాజధాని నిర్ణయాధికారం రాష్ట్ర ప్రభుత్వానిదే

అమరావతి:
★ రాష్ట్ర విభజన అంశాలపై ఏపీ ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది.

★ రాజధాని నిర్ణయాధికారం రాష్ట్ర ప్రభుత్వానిదేనని అఫిడవిట్‌లో ప్రభుత్వం పేర్కొంది.

★ హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో కేంద్రం కూడా ఇదే విషయాన్ని తెలిపిందని జగన్ సర్కార్ గుర్తుచేసింది.

★ వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాల ఆమోదం తర్వాత ఆఫీసుల తరలింపుపై పిటిషనర్లు లేవనెత్తిన అంశాలు న్యాయ సమీక్షార్హం కాదని తెలిపింది.

★ రాజధాని సహా అభివృద్ధి ప్రణాళికలు, వివిధ ప్రాజెక్టులు సమీక్షించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని అఫిడవిట్‌లో ప్రభుత్వం పేర్కొంది.

★ రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంట్ సాక్షిగా కేంద్రం వాగ్ధానం చేసిందని అఫిడవిట్‌లో ఏపీ ప్రభుత్వం గుర్తుచేసింది.

★ ప్రత్యేక హోదా అమలుకానంత వరకు విభజన ప్రక్రియ అసంతృప్తిగానే మిగిలిపోయిందని భావించాల్సి ఉంటుందని హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌‌లో ఏపీ ప్రభుత్వం పేర్కొంది.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: రాజధాని నిర్ణయాధికారం రాష్ట్ర ప్రభుత్వానిదే Rating: 5 Reviewed By: NEWS UPDATE