విజయవాడ: భావి విద్యార్థులను తయారుచేసే ఉపాధ్యాయులు కరోనా మహమ్మారి వల్ల ఉపాధి కోల్పోయి రోడ్డునపడుతున్నారు. పొట్టకూటి కోసం ఎదో ఒక పని చేసుకుంటున్నారు. తాజాగా విజయవాడకు చెందిన టి.వెంకటేశ్వరరావు అనే ఉపాధ్యాయుడు పాఠశాలలు మూతపడడంతో కుటుంబ పోషణ నిమిత్తం రోడ్డుపై చెప్పులు అమ్ముకుంటున్నాడు.
విజయవాడలోని మూడు ప్రైవేటు స్కూళ్లలో వెంకటేశ్వరరావు పార్ట్ టైమ్ పద్ధతిలో టెన్త్ క్లాస్ విద్యార్థులకు గణితం బోధిస్తాడు. అయితే కరోనా వ్యాప్తి, లాక్ డౌన్ కారణంగా స్కూళ్లు మూతపడడంతో ఈ ఉపాధ్యాయుడి ఆర్థిక పరిస్థితి క్షీణించింది.
ఫుల్ టైమ్ టీచర్లకే అరకొరగా జీతాలు చెల్లిస్తున్న స్కూల్ యాజమాన్యాలు తమవంటి పార్ట్ టై ఉపాధ్యాయులను పట్టించుకోవడంలేదని, దాంతో చేసేది ఏమి లేక రేవు సెంటర్ లో పాదరక్షలు విక్రయిస్తూ, వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని పోషించుకుంటున్నానని వెంకటేశ్వరరావు వెల్లడించాడు.