728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
August 7, 2020

జేసీ ప్రభాక‌ర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిల అక్రమ అరెస్ట్ వైకాపా రాక్షస సంస్కృతికి నిద‌ర్శనం: చంద్రబాబు

అమరావతి:
★ అభివృద్ధి, సంక్షేమాన్ని గాలికొదిలేసి.. కుట్ర రాజ‌కీయాలు, క‌క్ష సాధింపు చ‌ర్యలే అజెండాగా రాష్ట్ర ప్రభుత్వం ప‌నిచేస్తోంది.

★ తెలుగుదేశం పార్టీ నాయ‌కులు జేసీ ప్రభాక‌ర్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డిల అక్రమ అరెస్టును తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఖండించారు.

★ విడుద‌లైన 24 గంట‌ల‌లోపే టీడీపీ నేత‌ల‌ను మ‌ర‌లా అరెస్ట్ చేయ‌డం వైకాపా క‌క్ష సాధింపు చ‌ర్యలకు నిద‌ర్శనం.

★ వైకాపా మంత్రులు, ఎమ్మెల్యేలు య‌థేచ్ఛగా కోవిద్ నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించినా.. రాష్ట్రంలో ఎక్కడా ఒక్క కేసు న‌మోదు చేయ‌లేదు.

★ వంద‌లాది మందితో బ‌హిరంగ స‌మావేశాలు పెట్టిన విజ‌య‌సాయిరెడ్డి లాంటి వారిని వ‌దిలేసి.. జేసీ కుటుంబ స‌భ్యుల‌పై మాత్రం త‌ప్పుడు కేసులు బ‌నాయిస్తున్నారు.

★ నియంతృత్వంతో ప్రజాభిమానం ఉన్న నాయ‌కుల‌ను అడ్డుకోలేరు.

★ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి క‌క్ష సాధింపు చ‌ర్యలు నానాటికి ప‌రాకాష్టకు చేరుతున్నాయి.

★ విధ్వంసం, త‌ప్పుడు కేసులు, అక్రమ అరెస్టుల‌తో రాష్ట్రంలో భ‌యాన‌క వాతావ‌ర‌ణాన్ని సృష్టిస్తున్నారు.

★ ప్రజ‌లు ఇచ్చిన అధికారాన్ని ప్రజా క్షేమం కోసం వినియోగించ‌కుండా.. ప్రతిప‌క్ష నేత‌ల‌ను అణ‌చివేయ‌డానికి ఉప‌యోగిస్తున్నారు, మాన‌వ‌త్వం లేకుండా వ్యవ‌హ‌రిస్తున్నారు.

★ నియంత‌లు పాల‌కులైతే ప‌రిపాల‌న ఇలాగే ఉంటుంది.

★ టీడీపీ నాయ‌కుల‌పై అక్రమ కేసులు పెట్టి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి రాక్షసానందం పొందుతున్నారు.

★ ఇక‌నైనా కక్ష సాధింపు చ‌ర్యలు విడ‌నాడి.. తెలుగుదేశం నాయ‌కుల‌పై పెట్టిన అక్రమ కేసులు త‌క్షణ‌మే ఎత్తివేయాలి.

★ లేనిప‌క్షాన వైకాపా నాయ‌కుల రాక్షస సంస్కృతికి ప్రజ‌లే భ‌విష్యత్తులో త‌గిన బుద్ది చెబుతారు అని అన్నారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: జేసీ ప్రభాక‌ర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిల అక్రమ అరెస్ట్ వైకాపా రాక్షస సంస్కృతికి నిద‌ర్శనం: చంద్రబాబు Rating: 5 Reviewed By: NEWS UPDATE