చిలకలూరిపేట: నియోజకవర్గంలోని నాదెండ్ల మండలం సాతులూరు కెనాల్ లో ఈతకు వెళ్లిన ఇద్దరు విద్యార్థుల్లో ఒక విద్యార్థి గల్లంతైన సంఘటన జరిగింది. నాదెండ్ల మండలం సాతులూరు గ్రామానికి చెందిన తన మేనమామ బండారుపల్లి మస్తాన్ రావు ఇంటికి కృష్ణా జిల్లా ఆముదాలపల్లికి చెందిన స్వరూపు(14) తొమ్మిదో తరగతి చదువుతూ, తన మేనమామ ఇంటికి సాతులూరు వారం క్రితం వచ్చాడు.
అయితే బండారుపల్లి మస్తాన్ రావు కుమారుడైన విజయ్ కుమార్ మరియు స్వరూపులు ఇరువురు సాతులూరులోని పెదనందిపాడు వెళ్లే కాలువలో ఈరోజు సాయంత్రం ఈతకు వెళ్లారు. ఇరువురు నీటిలో కొట్టుకుపోతుండగా స్థానికులు కొంతమంది చూసి విజయ్ కుమార్ ను రక్షించారు. అయితే కృష్ణా జిల్లా ఆముదాలపల్లి చెందిన స్వరూపు గల్లంతయ్యి ఇప్పటి వరకు జాడ తెలియలేదు.
పోలీసులు, స్థానికులు స్వరూప్ కోసం గాలిస్తున్నారు.