చిలకలూరిపేట: నియోజకవర్గంలోని ఎడ్లపాడు మండలం కొండవీడులో నాటు సారా కాస్తున్న వారిపై గుంటూరుకు చెందిన ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్క్వాడ్ మరియు చిలకలూరిపేట ఎక్సైజ్ ఎస్ఐ ప్రసాదులు దాడి చేసి నాటుసారా పట్టుకున్నారు. నాటుసారా కాస్తున్న ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకొని అతని వద్ద నుండి 2,400 లీటర్ల ఎఫ్.జె వ్వాష్ మరియు 5 లీటర్ల నాటుసారాను పట్టుకొని వారిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. గత కొంత కాలం నుండి కొండవీడులో అక్రమ నాటుసారా తయారీతో జిల్లా అధికారులకు పలువురు ఫిర్యాదు చేయడంతో జిల్లా అధికారి గుంటూరు నుండి వచ్చి దాడులు చేసి నాటు సారా కాసే వారిని అదుపులోకి తీసుకున్నారు.
August 29, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: కొండవీడులో నాటుసారా తయారీపై ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్క్వాడ్ దాడులు
Rating: 5
Reviewed By: NEWS UPDATE


