సెల్‌ఫోన్లను ఉపయోగించే విషయంలోచాలా జాగ్రత్తలు పాటించాలి. లేకపోతే ఒక్కోసారి అవే ప్రమాదాలు తెచ్చిపెడుతుంటాయి. తమిళనాడులో ఇలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఏకంగా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోయారు. రాష్ట్రంలోని కరూర్ జిల్లాలో ఈ విషాదం చోటు చేసుకుంది. నిన్న రాత్రి సెల్‌ఫోన్ ఛార్జింగ్ పెట్టి ఇద్దరు పిల్లలతో కలిసి నిద్రలోకి జారుకుంది ముత్తులక్ష్మీ అనే మహిళ. అయితే ప్రమాదవశాత్తు ఆ సెల్‌ఫోన్ పేలిపోవడంతో.. ఇంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇంట్లో మంటలు వ్యాప్తి చెందడటంతో ముత్తులక్ష్మీతో పాటు ఆమె ఇద్దరు పిల్లలు రంజిత్, దక్షిత్ మృతి చెందారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
August 10, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: సెల్‌ఫోన్ పేలి ముగ్గురు మృతి
Rating: 5
Reviewed By: NEWS UPDATE

