చిలకలూరిపేట: పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో గురువారం పట్టణంలోని వైఎస్సార్ చేయూత లబ్ధిదారులకు ఎమ్మెల్యే చెక్కు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విడదల రజిని మాట్లాడుతూ మహిళా స్వావలంబన దిశగా ఏపీలో ఈ రోజు నిజమైన అడుగు పడిందని తెలిపారు. మహిళా అభ్యున్నతి విషయంలో ఈ పథకం ఒక విప్లవాన్ని సృష్టిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదని తెలిపారు. తమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో ఎప్పుడూ ముందు ఉంటారని తెలిపారు. 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల లోపు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మహిళలకు ఏటా రూ.18750 చొప్పున నాలుగేళ్లకు కలిపి రూ.75వేలు ఇవ్వడం అనేది దేశంలోనే ఎక్కడా లేదని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లోని మహిళలు మాత్రమే ఈ గొప్ప అవకాశాన్ని పొందగలిగారని, సీఎం జగన్ వల్లనే ఇది సాధ్యమైందని వెల్లడించారు. మహిళ అభివృద్ధే తమ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యం అని ఎప్పటికప్పుడు పథకాల ద్వారా చాటి చెబుతూనే ఉన్నామని చెప్పారు. పాదయాత్ర సమయంలో 45 ఏళ్ల నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు పింఛన్లు ఇస్తామని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారని, ఇప్పుడు ఆ హామీని నెరవేర్చుతూ అంతకు మించిన సాయాన్ని అందజేస్తున్నారని వెల్లడించారు. నగదు మొత్తాన్ని ఒకే సారి ఇవ్వడం అత్యంత సాహసోపేత నిర్ణయమన్నారు. ప్రతి మహిళకు ఈ నగదు ఎంతో మేలు చేస్తుందని చెప్పారు. నిరుపేద అక్కచెల్లెమ్మలకు ఆర్థిక వెసులుబాటు కలుగుతుందన్నారు. కరోనా పీడిస్తున్న ఈ సమయంలో ప్రభుత్వం అందజేసిన ఈ నగదు సాయం జీవితాన్ని నిలబెడుతుందనడంలో సందేహం లేదని చెప్పారు. కార్యక్రమంలో చిలకలూరిపేట మార్కెట్ యార్డు చైర్మన్ బొల్లెద్దు చిన్న, పార్టీ నాయకులు పఠాన్ తల్హాఖాన్, నాగరాజు, శ్రీకాంత్, మున్సిపల్ కమిషనర్ సీహెచ్ శ్రీనివాసరావు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.