★ మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకు తాజాగా నిర్వహించిన కరోనా పరీక్షల్లో నెగెటివ్ రావడం తెలిసిందే.
★ దాంతో అచ్చెన్నాయుడును ఎన్నారై ఆసుపత్రి నుంచి ఈ సాయంత్రం డిశ్చార్జి చేశారు.
★ దాంతో ఆయన ఆసుపత్రి నుంచి శ్రీకాకుళంలోని తన స్వగ్రామం నిమ్మాడకు బయల్దేరారు.
★ ఈఎస్ఐ కొనుగోళ్ల వ్యవహారంలో అచ్చెన్నకు మూడ్రోజుల కిందట హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
★ ఈఎస్ఐ కొనుగోళ్లలో కుంభకోణం జరిగిందంటూ అచ్చెన్నను ఏసీబీ కొన్నినెలల కిందట అరెస్ట్ చేసింది.
★ అయితే ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నందున గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలోనూ, ఆపై రమేశ్ ఆసుపత్రిలోనూ చికిత్స అందించారు.
★ కరోనా సోకడంతో కోర్టు ఆదేశాల మేరకు ఎన్నారై ఆసుపత్రికి తరలించారు.
★ కరోనా నయం కావడంతో ఆయన తన స్వగ్రామానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు.

