పట్టణంలో దోమలు పెరిగిపోతున్నాయని, ఎవరికైనా జ్వరం వాస్తే అది డెంగ్యూ, మలేరియా జ్వరాలో లేక కరోనాయో అర్థంకాని పరిస్థితిలో ప్రజలు ఉన్నారని, వారికి అవగాహన కల్పించవలసిన అధికారి ఫోన్ ఎత్తకుండా, విజ్ఞాపన పత్రం ఇవ్వాలంటే అటెండర్కు ఇవ్వమని చెప్పటం పట్ల రావు సుబ్రమణ్యం జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
ఇప్పటివరకు పట్టణంలో మున్సిపల్ కమిషనర్ తీరుపై అఖిలపక్ష నాయకులు అనేక మంది ఆసనం వ్యక్తం చేసిన గాని ఆయన తీరు మారలేదని అన్నారు. ఈ విషయంపై తాము రాష్ట్ర అధికారులకు కూడా ఫిర్యాదు చేయనున్నట్లు ఈ సందర్భంగా నవతరం పార్టీ అధ్యక్షులు రావు సుబ్రమణ్యం తెలిపారు.
