728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
August 26, 2020

సివిల్ సప్లైస్ కార్మికులకు కూలి పెంచాలి

చిలకలూరిపేట: సివిల్ సప్లయిర్స్ కు కూలి రేట్లను పెంపుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ చిలకలూరిపేటలో సివిల్ సప్లయిర్స్ కార్మికులు సమ్మెకి దిగి తక్షణమే తమ కోర్కెలు తీర్చాలని మార్కెట్ యార్డు వద్ద ధర్నా చేశారు. ఈ ధర్నాలో పాల్గొన్న సీపీఐ ఏరియా కార్యదర్శి కామ్రేడ్ cr మోహన్  మాట్లాడుతూ పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలను దృష్టిలో పెట్టుకొని సివిల్ సప్లయిర్స్ కూలి రేట్లు పెంచాలని.. కరోనాని సైతం లెక్కచేయకుండా పనిచేస్తూ ప్రజల అవసరాలకు ఉపయోగపడుతున్న కార్మికులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై వున్నదని.. తక్షణమే 2020 జనవరి నుండి కూలి రేట్లు పెంపుదల చేసి జిఓతో పాటు బకాయిలు కూడా చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం మార్కెట్ యార్డ్ అధికారికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కామ్రేడ్ సుభాని, దాసరి వరహాలు, కార్మికులు సురభయ్య, మాణిక్యాలరావు అధిబాబు, సురేష్, తదితరులు పాల్గొన్నారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: సివిల్ సప్లైస్ కార్మికులకు కూలి పెంచాలి Rating: 5 Reviewed By: NEWS UPDATE