728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
August 26, 2020

లాక్ డౌన్ లో సేవలు అందించిన వారికి మిత్రా సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో సన్మానం

చిలకలూరిపేట: కరోనా మహమ్మారి దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న తరుణంలో చిలకలూరిపేట నియోజకవర్గంలో వలస కార్మికులకు, పేదలకు, వృద్ధులకు, వికలాంగులకు, పనులులేకుండా ఇబ్బందులు పడుతున్న అయా వార్డులలో నిత్యావసర సరుకులు, కూరగాయలు పంపిణీ చేసిన వారిని మిత్రా సర్వీస్ సొసైటీ గుర్తించి సన్మానం చేశారు. వారిలో శ్రీ దత్త సాయి అన్నదాన సమాజం అధ్యక్షులు పూసపాటి బాలాజీ, సిద్ధాంతి షేక్ కరిముల్లా, కారుణ్య ఆశ్రమ నిర్వాహకులు యం.అబ్రహం సామ్యాల్, షేక్ బడేమియా, ప్రశాంతి వృద్ధుల ఆశ్రమ నిర్వాహకులు షేక్ అమీనా, సిద్ధూ లక్ష్మణాచారి, సయ్యద్ నజీర్ మరియు షేక్ అబ్దుల్ ఖదీర్ ఉన్నారు.

ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సర్వీస్ సొసైటీ సభ్యులు మాట్లాడుతూ కరోనాను లెక్కచేయకుండా సేవలు చేసినా మహనీయులకు సన్మానం చేయడం చాలా ఆనందంగా ఉందని.. కరోనా సమయాలలో చాలామంది ధనవంతులు గృహాలకు పరిమితమయ్యారని, సామాన్య మధ్య తరగతి వారు సాటి ప్రజల ఆకలిని తీర్చిన వారి సహృదయానికి పాదాభివందనం చేసిన తక్కువేనని వారు పేర్కొన్నారు. మదర్ దెరిస్సా 110వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం చేయడం చాలా గొప్పగా భావిస్తున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా బాలల రచయిత దార్ల బుజ్జిబాబు, మిత్రసర్వీస్ సొసైటీ అధ్యక్షులు కొండ్రముట్ల నాగేశ్వరరావు, ఉపాధ్యక్షులు బి.శ్రీను నాయక్, సహాయ కార్యదర్శి గంజి బాలసుబ్రమణ్యం, కోశాధికారి తన్నీరు వీరాంజనేయులు, సభ్యులు అనపర్తి వెంకట్, వంజా ముత్తయ్య, అడపా రవి, హ్యూమన్ రైట్స్ ఫోరం అబ్దుల్ మునాఫ్, షేక్ గౌస్, తన్నీరు రామారావు, చేబ్రోలు వెంకటేష్ చేవూరి కృష్ణమూర్తి రాచపూడి వెంకట్, తదితరులు పాల్గొన్నారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: లాక్ డౌన్ లో సేవలు అందించిన వారికి మిత్రా సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో సన్మానం Rating: 5 Reviewed By: NEWS UPDATE