చిలకలూరిపేట: ప్రైవేటు, కార్పొరేట్ వైద్యశాలల మీద చర్యలు తీసుకోవాలని కోరుతూ AIYF ఆధ్వర్యంలో చిలకలూరిపేట తహసీల్దార్ కార్యలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న AIYF జిల్లా కార్యదర్శి సుభాని మాట్లాడుతూ ప్రైవేట్, కార్పొరేట్, హాస్పిటల్స్ లో ఫీజులు తట్టుకోలేక సామాన్య, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కరోనా ను పెద్ద భూతంగా ప్రజలకు చూపించి వారిని ఆర్ధికంగా దోచుకుంటున్నారని.. ప్రభుత్వ అనుమతి వచ్చిన ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్స్ యాజమాన్యాలు డిపాజిట్ల పేరుతో లక్షల రూపాయలు డిమాండ్ చేస్తూ ప్రజల ప్రాణాలతో చేలాగటమాడ్తున్నారు.
లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి, వ్యాపారాలు నష్టపోయి, బ్రతకడమే కష్టంగా మారిన తరుణంలో వైద్యం కోసం ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్స్ కు వెళ్లాలంటే భయపడాల్సిన పరిస్తితి ఏర్పడింది. ప్రభుత్వం వెంటనే డాక్టర్ల, నర్సుల ల్యాబ్ టెక్నిషియన్స్ కొరత లేకుండా చూసి పేద ప్రజల ప్రాణాలు కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో కామ్రేడ్ మల్లికార్జున్, వెంకటేష్, రాజేష్, తదితరులు పాల్గొన్నారు.