728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
August 28, 2020

దళిత కుటుంబాన్ని పరామర్శిస్తే అరెస్టులా?: టీడీపీ నేతలు

చిలకలూరిపేట: నియోజకవర్గ టీడీపీ శ్రేణులు నల్ల కండువాలు, రిబ్బన్లు ధరించి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కి వినతి పత్రం సమర్పించి,  దళితులపై జరుగుతున్న దాడులకు తమ నిరసనను తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన దళిత యువకుడు ఓం ప్రతాప్ మృతిపై ఎన్నో అనుమానాలు ఉన్న వేళ, ఓం ప్రతాప్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న టీడీపీ నేతలను హౌస్ అరెస్ట్ చెయ్యాల్సిన అవసరం ఏముంది..? నిజాలు తెలుసుకోవాలి అనుకోవటం తప్పా..? దళిత యువకుని మరణంలో వైసీపీ నాయకుల పాత్ర లేకపోతే మృతుని కుటుంబాన్ని పరామర్శ చేసేందుకు వెళుతున్న ప్రతిపక్ష నేతలను ఎందుకు హౌస్ అరెస్టు చేశారో చెప్పాలని వారు డిమాండ్ చేశారు.

ఈ దుర్ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని, ఏది ఆత్మహత్యో, ఏది హత్యో అర్థం కాని పరిస్థితి రాష్ట్రంలో ఉందన్నారు. మరుసటి రోజు అనేదే లేనట్లుగా అవినీతికి, అరాచకాలకు తెగబడ్డారని వైసీపీ నేతల తీరుపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ఇప్పుడున్న ప్రభుత్వం దళిత ఓటు బ్యాంకుతో గద్దెనెక్కి ఇప్పుడు, వారిని అన్ని విధాలుగా అణగద్రోక్కుతున్నారు అని తెలిపారు. ఈ సమావేశంలో నెల్లూరి సదాశివ రావు, షేక్ కరిముల్లా, పఠాన్ సమద్ ఖాన్, ముద్దన నాగేశ్వర రావు, ఇనగంటి జగదీష్, తూబాడు రాజు, కొండా వీరయ్య, మద్దిబోయిన శివ, మురకొండమల్లిబాబు, అజారుద్దీన్, అరె మల్లికార్జునరావు, షేక్ బాజీ, పాపారావు, షేక్ అబ్దుల్, పిల్లికోటి, బిట్రా బ్రహం, తదితరులు పాల్గొనారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: దళిత కుటుంబాన్ని పరామర్శిస్తే అరెస్టులా?: టీడీపీ నేతలు Rating: 5 Reviewed By: NEWS UPDATE