చిలకలూరిపేట: పురపాలక సంఘ పరిదిలో గల ఖాళీగా ఉన్న వార్డు వలంటీర్లను భర్తీ చేసుకొనుటకు ప్రభుత్వం ఆదేశం జారీ చేసింది. కావున చిలకలూరిపేట పురపాలక సంఘపరిదిలో ఏర్పడిన 8 ఖాళీలను భర్తీ చేయుటకు SSC లేదా తత్సమాన పరీక్షల యందు ఉత్తీర్ణులై అర్హత కలిగి ఉండి తేది.01.01.2020 నాటికి వయస్సు 18 నిండి 35 సం|| లోపు గలవారు తేది. 01.09.2020 నుండి 05.09.2020 వరకు ఆన్ లైన్ నందు దరఖాస్తు చేసుకొనవలసినదిగా పురపాలక సంఘం కమిషనర్ తెలియజేశారు. సదరు ఖాళీలకు సంబంధించిన నోటిఫికేషన్ ను వార్డు సచివాలయం నందు, మరియు పురపాలక సంఘ కార్యాలయ నోటీసు బోర్డు నందు ఉంచబడునని, దరఖాస్తు చేసుకొనవలసిన ఆన్ లైన్ లింక్ క్లిక్ చేయవలసినదిగా కోరారు. https://gswsvolunteer.apcfss.in/
August 29, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట: వార్డు వాలంటరీ పోస్టులకు నోటిఫికేషన్
Rating: 5
Reviewed By: NEWS UPDATE

