🔷 జగన్ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇళ్లపట్టాల పంపిణీ కార్యక్రమం మరోసారి వాయిదా పడింది.
🔷 కోర్టులో కేసులు పెండింగ్‌లో ఉండటం వల్ల ఈ నెల 15వ తేదీన చేపట్టాలనుకున్న ఇళ్లపట్టాల పంపిణీని ప్రభుత్వం వాయిదా వేసింది.
🔷 దీనితో అక్టోబర్ 2న గాంధీ జయంతి కానుకగా పేదలకు ఇళ్ళ పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
🔷 దాదాపు 30 లక్షల మంది మహిళలకు ఇళ్ళ పట్టాలు ఇవ్వాలని.. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం భూములను సిద్దం చేసిన సంగతి తెలిసిందే.
🔷 కాగా, ఈ ఇళ్లపట్టాల కార్యక్రమం ఇప్పటికి మూడుసార్లు వాయిదా పడింది.
🔷 వాస్తవానికి మార్చి 15న ఇళ్ల పట్టాల పంపిణీ చేయాల్సిన ఉండగా.. ఆ తర్వాత ఉగాదికి వాయిదా పడింది.
🔷 ఇక జూన్ నెలలో ఈ కార్యక్రమం చేపట్టాలని అనుకున్నారు.
🔷 కానీ రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసులు కారణంగా అది కాస్తా సాధ్యపడలేదు.
🔷 ఇప్పుడు ఆగష్టు 15న చేపట్టాలని అనుకుంటే.. ఆ డేట్ కూడా మళ్లీ వాయిదా పడింది.

