చిలకలూరిపేట: నియోజకవర్గంలో కరోనా కేసులు 1000 కి చేరుకున్నాయి. నియోజకవర్గ పరిధిలోని పట్టణంలో కరోనా కేసులు అత్యధిక స్థాయిలో నమోదవుతున్నాయి. రోజుకు 10 కేసులు తగ్గకుండా 90 కేసులు మించకుండా తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తుంది. అయితే ఇప్పటి వరకు చిలకలూరిపేట పట్టణంలో 610 కరోనా కేసులు నమోదయ్యాయి.
అలానే చిలకలూరిపేట రూరల్ మండలంలో 138 కరోనా కేసులు నమోదు కాగా, అత్యధికంగా వేలూరు గ్రామంలో మరియు కోమటి నేనివారిపాలెంలో ఎక్కువ కేసులు నమోదయ్యాయి. అలానే నాదెండ్ల మండలంలో ఇప్పటివరకు 154 కరోనా కేసులు నమోదు కాగా సాతులూరు గ్రామంలో 30 పైగా కేసులు నమోదయ్యాయి. ఎడ్లపాడు మండలంలో ఇప్పటివరకు 98 కరోనా కేసులు నమోదు కాగా ఎక్కువగా ఎడ్లపాడులోనే నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి.
మొత్తంమీద చిలకలూరిపేట పట్టణంలో ఇప్పటివరకు 610 కేసులు నమోదు కాగా, నియోజకవర్గ పరిధి మొత్తం మీద 1000 మార్కుకు చేరాయి.