చిలకలూరిపేట: నియోజకవర్గంలోని యడ్లపాడు మండలం తిమ్మాపురం గ్రామంలో సచివాలయం నిర్మాణం కోసం శుక్రవారం శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల కోసం పనిచేస్తేనే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించినట్లు అవుతుందనే ఉద్దేశంతో ప్రజల చేత ఎన్నుకోబడిన తమ ప్రభుత్వం సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చిందన్నారు. సచివాలయాల ద్వారా దాదాపు 500 కు పైగా ప్రభుత్వ సేవలు పౌరులకు అందుతున్నాయని తెలిపారు. సచివాలయాలు సర్వ సమస్యల పరిష్కారుణులుగా మారుతున్నాయని వెల్లడించారు.
గతంలో ఏదైనా సమస్య వస్తే పరిష్కరించే వారు దొరికేవారు కాదని, ఇప్పుడు చక్కగా అందరూ సచివాలయాలకు వచ్చి సమస్యలను పరిష్కరించుకుంటున్నారని, ఇంత గొప్ప అదృష్టం జగనన్న ముఖ్యమంత్రిగా ఉండటం వల్లనే దక్కిందని ఎమ్మెల్యే వెల్లడించారు. ప్రజల మనసు చూరగొనేలా, జనం గుండెల్లో నిలిచేలా ముందుకు వెళుతున్న ఈ ప్రభుత్వంలో తానూ భాగస్వామిని అయినందుకు ఎంతో గర్వంగా ఉందని చెప్పారు. తమ నాయకుడు వైఎస్ జగనన్న అడుగుజాడల్లో తాము ముందుకు వెళతామని, ఆదర్శవంతమైన పాలన ప్రజలకు అందేలా చూస్తామని తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.