అమరావతి: ఏపీలో కరోనా కేసులు రోజురోజుకి పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 59,919 మందికి పరీక్షలు నిర్వహించగా 10,776 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 4,76,506 కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,02,067 యాక్టివ్ కేసులు ఉండగా... 24 గంటల్లో 12,334 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ కాగా.. ఇప్పటివరకు 3,70,163 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 24 గంటల్లో కరోనా కారణంగా 76 మంది మృతి చెందగా... ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 4,276 కు చేరింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 39,65,694 శాంపిల్స్ ని పరీక్షించారు.
September 4, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: ఏపీలో కరోనా: కొత్తగా 10,776 కేసులు
Rating: 5
Reviewed By: NEWS UPDATE

