చిలకలూరిపేట: వైకాపా మరియు కాపు సేవా సంఘం నాయకులు మల్లెల రాజేష్ నాయుడు జన్మదినం సందర్భంగా మల్లెల యూత్ ఆధ్వర్యంలో పట్టణంలోని బాపూజీ మరియు సాయి ప్రశాంతి వృద్ధాశ్రమాల్లో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రశాంతి వృద్ధాశ్రమంలో నీటి ట్యాంక్ ను బహుకరించారు. నర్సారావుపేట రోడ్ లోని పేదలకు మల్లెల రాజేష్ నాయుడు అభిమానులు సుమారు 300 మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. మల్లెల రాజేష్ నాయుడు జన్మదిన సందర్భంగా చిలకలూరిపేట పట్టణంలో వైకాపా నాయకులు, కాపు నాయకులు తదితరులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
September 4, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: మల్లెల రాజేష్ నాయుడు జన్మదిన సందర్భంగా పేటలో పలు సేవా కార్యక్రమాలు
Rating: 5
Reviewed By: NEWS UPDATE


