అమరావతి: ఏపీలో కరోనా కేసుల సంఖ్య 6 లక్షల మార్కును దాటింది. గత 24 గంటల్లో 77,492 మందికి పరీక్షలు నిర్వహించగా 8,702 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 6,01,462 కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 88,197 యాక్టివ్ కేసులు ఉండగా... 24 గంటల్లో 10,712 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ కాగా.. ఇప్పటివరకు 5,08,088 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 24 గంటల్లో కరోనా కారణంగా 72 మంది మృతి చెందగా... ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 5,177 కు చేరింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 48,84,371 మందికి పరీక్షలు చేశారు.
September 17, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: ఏపీలో 6 లక్షలు దాటిన కరోనా కేసులు
Rating: 5
Reviewed By: NEWS UPDATE

