728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
September 18, 2020

చిలకలూరిపేట తహసీల్దార్ కార్యాలయం వద్ద అఖిలపక్షం ఆధ్వర్యంలో నిరసన

చిలకలూరిపేట: నియోజకవర్గ పరిధిలోని బొప్పూడి, గొట్టిపాడు, చిలకలూరిపేట పట్టణంలో ఉన్న చెంచులకు (ఎస్టీ)లకు భూములు కేటాయించాలని కోరుతూ నవతరం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు తహసిల్దార్ కార్యాలయం ఎదుట ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, అఖిలపక్ష నాయకుల ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ చెంచులకు భూములు ఇవ్వాలని గత కొద్ది సంవత్సరాల నుండి కోరుతున్న.. ఈ సమస్య పై ఎవరూ స్పందించడం లేదని తెలియజేశారు. చెంచులకు భూములు వచ్చేంతవరకు అఖిలపక్ష నాయకులు పోరాటం చేస్తారని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో నవతరం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రావు సుబ్రమణ్యం, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎం.రాధాకృష్ణ, టీడీపీ నాయకులు అజారుద్దీన్, అబ్దుల్లా, ఆంజనేయులు, సిపిఎం నాయకులు పేరుబోయిన వెంకటేశ్వర్లు, బొల్లు శంకర్రావు, లోక్ సత్తా పార్టీ నాయకులు భాను ప్రసాద్, బీఎస్పీ నాయకుడు నల్లపు కోటి, హ్యూమన్ రైట్స్ తరఫున అబ్దుల్ మునాఫ్, గిరిజన సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర నాయకులు శీను నాయక్, దేవరకొండ నాగేశ్వరరావు, ముత్తయ్య, ఆవుల వెంకటేశ్వర్లు, తదితర సంఘాల నాయకులు పాల్గొన్నారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట తహసీల్దార్ కార్యాలయం వద్ద అఖిలపక్షం ఆధ్వర్యంలో నిరసన Rating: 5 Reviewed By: NEWS UPDATE