గుంటూరు: ప్రత్తిపాడు నియోజకవర్గం కాకుమాను మండలంలో జరిగిన వై.యస్.ఆర్ ఆసరా వారోత్సవాల కార్యక్రమంలో హోంమంత్రి మేకతోటి సుచరిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి సుచరిత మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి సుదీర్ఘమైన పాదయాత్రలో మహిళల కష్టాలు స్వయంగా విని చలించిపోయారన్నారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలో కూడా చాలా మంది మహిళలు కష్టాలు చెప్పుకున్నారని తెలిపారు. మహిళల కష్టాలు చూసి చలించిన జగన్ అనేక పథకాలను ప్రవేశపెట్టారని హోంమంత్రి తెలిపారు. వై.యస్.ఆర్ చేయూత, ఆసరా, పావలా వడ్డీ, ఇలా అనేక పథకాలు మహిళల అభ్యున్నతి కోసం ప్రవేశపెట్టిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని అన్నారు. ఆనాడు వై.యస్.ఆర్ మహిళలను లక్షాధికారిగా చూడాలని కలగన్నారు. నేడు సీఎం జగన్ చేసి చూపించారన్నారు. మహిళలు స్వయం ఉపాధి పథకం ద్వారా తమ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా చేశారని, మహిళల పేరు మీద ఇళ్ల పట్టాల కూడా త్వరలోనే ఇవ్వనున్నట్లు, ఇంటి నిర్మాణం కోసం రుణం కూడా ఇస్తోంది ఈ ప్రభుత్వం అని తెలిపారు. కాకుమానులోని శుభ కళ్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో తహసిల్దార్ వెంకటేశ్వర్లు, ఎండీవో హీరాలాల్, ఏ.పీఎం.సోమశేఖర్, వైఎస్సార్సీపీ నాయకులు మదమంచి వాసు, రామకృష్ణ, పొన్నారవు, లబ్దిదారులు, మహిళలు పాల్గొన్నారు.
September 18, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: మహిళల పేరు మీద ఇళ్ల పట్టాలు: హోంమంత్రి సుచరిత
Rating: 5
Reviewed By: NEWS UPDATE

