728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
September 28, 2020

చిలకలూరిపేట: పైప్ లైన్ లీకులు... ఆ పేరుతో అవినీతి ధార

చిలకలూరిపేట: పట్టణంలో ఇబ్బడిముబ్బడిగా ఎక్కడ చూసినా మున్సిపల్ పైప్ లైన్లు లీకులు పెరిగిపోయాయి. అసలే వర్షాకాలం కావడంతో లీకైన పైపుల్లో వర్షపునీరు, కాలువలోని దుర్గంధపు నీరు చేరి అవి కుళాయిల ద్వారా వచ్చి డెంగ్యూ, కలరా తదితర వ్యాధులు వచ్చే అవకాశం లేకపోలేదని చిలకలూరిపేటలోని పుర ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గత సంవత్సరం పట్టణంలో డెంగ్యూ వీర విహారం చేసి అప్పట్లో అనేక మంది మృత్యువాత పడ్డారు. అప్పట్లో ఇప్పుడున్న ఒక ఇంజనీరింగ్ స్థాయి అధికారి విధులు కూడా నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ అధికారి ఆ సెక్షన్లో ఉన్నతాధికారిగా ఉండి కూడా కుళాయిల లీకులపై శ్రద్ధ పెట్టకపోవడం పట్ల ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

చిలకలూరిపేట పట్టణంలోని జాతీయ రహదారికి ఆనుకొని ఒక స్మశాన వాటిక పక్కన రోడ్డుపై భూమిలో నుంచి నీటి జలధార కొన్ని నెలల నుండి వస్తున్నా మున్సిపల్ అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవని చుట్టుపక్కల వారు చెబుతున్నారు. లీకుల వల్ల త్రాగునీరు వృధా కాకుండా చేయలేకపోతున్నారని అధికారులపై, సిబ్బందిపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. లక్షలకు లక్షలు లీకుల పేరుతో బిల్లులు చేసుకుంటున్నట్లు, ఈ విషయంపై గత కొద్ది రోజుల క్రితం జిల్లా ఉన్నతాధికారులకు మాజీ ప్రజా ప్రతినిధులు ఫిర్యాదులు కూడా చేసినట్లు తెలుస్తుంది. లీకులు సరి చేయటానికి అవుట్సోర్సింగ్లో పని చేస్తున్న వ్యక్తులను వినియోగించుకొని, టెండర్ల ద్వారా చేయించుకున్నట్లు వాటికి కూడా బిల్లులు చేసుకున్నట్లు కూడా విశ్వసనీయంగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కుళాయిల లీకుల పేరుతో లక్షల రూపాయలు బిల్లులు చేసు కోవడమే ధేయంగా కాకుండా... లీకులు సరిచేసి కుళాయిల ద్వారా కలుషిత నీరు కాకుండా మంచినీరు వచ్చేలా చేసి ప్రజారోగ్యం కాపాడాలని పుర ప్రజలు కోరుతున్నారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట: పైప్ లైన్ లీకులు... ఆ పేరుతో అవినీతి ధార Rating: 5 Reviewed By: NEWS UPDATE