728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
September 28, 2020

చిలకలూరిపేట మున్సిపల్ కమిషనర్ కు ప్రమోషన్ ఇస్తూ ట్రాన్స్ఫర్

చిలకలూరిపేట: పట్టణంలో దళిత క్రైస్తవుల సమాధులను కూల్చటం విషయంలో వివాదాస్పదమైన మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస రావు పాత్ర ఉందని.. సమాధులు పగులగొట్టిచ్చింన విషయం గత నాలుగు రోజుల నుండి రోజుకో మలుపు తిరుగుతున్న విషయం విదితమే. ఈ విషయంలో దళిత సంఘాల నాయకులు కోరిక మేరకు రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత, ఎమ్మెల్యే రజని శనివారం సమాధుల వద్దకు వచ్చి పరిశీలించి సమాధులు కట్టించాలని అధికారులను ఆదేశించారు. అధికారులపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించి న్యాయం జరిపిస్తానని హామీ ఇచ్చారు. టీడీపీ నిజనిర్ధారణ కమిటీ సభ్యులైన ఆనంద్ బాబు తదితరులు ఆదివారం సాయంత్రం సమాధుల వద్ద మాట్లాడుతూ సమాజంలో క్రైస్తవుల సమాధులను పడగొట్టడం హేయమైన చర్యగా అభివర్ణించారు. సమాధులను వెంటనే కట్టించి, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇది ఇలా ఉండగా వివాదాలకు కారణమైన మున్సిపల్ కమిషనర్ సిహెచ్ శ్రీనివాసరావును అసిస్టెంట్ గ్రేడ్ నుండి ప్రమోషన్ ఇస్తూ శ్రీకాళహస్తి గ్రేడ్-1 మున్సిపల్ కమిషనర్ గా పదోన్నతి ఇస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. వివాదాల చుట్టూ ఉన్న మున్సిపల్ కమిషనర్ కు ప్రమోషన్ లభించడంపై దళిత సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట మున్సిపల్ కమిషనర్ కు ప్రమోషన్ ఇస్తూ ట్రాన్స్ఫర్ Rating: 5 Reviewed By: NEWS UPDATE