చిలకలూరిపేట: పట్టణంలోని జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న దళిత క్రైస్తవ స్మశాన వాటికలోని సమాధులను గురువారం ఉదయం మున్సిపల్ అధికారి కూల్చివేతకు నిరసనగా ఈ రోజు తహసిల్దార్ కార్యాలయం ఎదుట ఉన్న అంబేద్కర్ విగ్రహం ఎదుట దళిత సంఘాల నాయకులు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం మండల తహసిల్దార్ కు విజ్ఞాపన పత్రం అందజేసారు. అయితే 24వ తేదీ ఉదయం 7 గంటల సమయంలో ప్రొక్లయితో దళిత స్మశాన వాటికలోని 100 సమాధుల కట్టడాలకు పైగానే నిర్దాక్షిణ్యంగా కూల్చివేయడం జరిగింది. విషయం తెలిసిన సమాధుల కట్టడాలకుసంబంధించిన బందువులు, రక్త సంబంధీకులు స్మశాన వాటికకు చేరుకొని ఎందుకు కూలదోస్తున్నారని ప్రొక్లయిన్డ్రైవరను అడుగగా కమీషనర్ పంపితే వచ్చికూలుస్తున్నానని చెప్పి అక్కడనుండి వెళ్ళిపోవడం జరిగింది.తదుపరి ఈ విషయం తమ ఆత్మగౌరవానికి భంగం కలిగి,ఆక్రమణకు గురైన స్థలాన్ని సర్వే చేయించి లోగడ ఎంత స్మశాన స్థలం ఉండేదో అంతే ఉండేలా, కూల్చి వేసిన సమాధుల స్మృతి చిహ్మాల కట్టడాలను పూర్తిగా ప్రభుత్వ బాధ్యతతో తిరిగి నిర్మించాలని కోరారు. సమాధుల ప్రక్కనే వున్న భూమిని కొనుగోలు చేసి ఈ స్మశానాన్ని విస్తృత పరచాలన్నారు. ఈ దుర్ఘటనపై వెంటనే విచారణ కమిటీని ఏర్పాటు చేయాలని తహసిల్దార్ ను దళిత సంఘాల నాయకులు కోరారు.
September 25, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: సమాధులను కూల్చివేసిన ఘటనపై విచారణ కమిటీ వేయాలి: దళిత సంఘాలు
Rating: 5
Reviewed By: NEWS UPDATE

