చిలకలూరిపేట: దళిత శ్మశాన వాటికలో జరిగిన విధ్వంసంపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఆధ్వర్యంలో నిజ నిర్ధారణ కమిటి ఏర్పాటు చేయడం జరిగిందని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ కమిటీలో తెలుగుదేశం పార్టీ నాయకులు పిల్లి మాణిక్యాల రావు, మానుకొండ శివ ప్రసాద్, దేవతోటి నాగరాజులు ఉన్నారు. శనివారం ఉదయం 10 గంటలకు చిలకలూరిపేటకు ఈ కమిటీ రానున్నట్లు తెలిపారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలోని దళిత స్మశాన వాటికలో 171 సమాదులను స్మశాన వాటిక ఆధునీకరణ పేరుతో తొలగించడం దుర్మార్గమని, దళితుల అంగీకారం, అనుమతి లేకుండా స్మశాన వాటికలో ఏ విధంగా పనులు మొదలు పెడతారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని అన్నారు. దళితుల మనోభావాలను అగౌరవ పరిచేలా, అవమాన పరిచేలా ప్రభుత్వం వ్యవహరిస్తుందని వీరు తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన 16 నెలల్లో రోజుకో చోట దళితులపై దాడులు జరుగుతున్నాయన్నారు. మరోవైపు దళితుల ఆస్థులను విధ్వంసం చేస్తున్నారు, విధ్వంసకర పాలనకు కేరాఫ్ అడ్రస్ గా ఆంధ్రప్రదేశ్ ను మార్చి దళితులపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని వీరు తెలిపారు. దళిత వ్యతిరేక ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారని కళా వెంకట్రావు ఒక ప్రకటనలో తెలియజేసారు.
September 25, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేటలో దళిత సమాధుల తొలగింపుపై టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ
Rating: 5
Reviewed By: NEWS UPDATE

