728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
September 25, 2020

ప్రజలకు సేవలందించడంలో పోలీసులు ముందుండాలి: హోంమంత్రి సుచరిత

అనంతపూరం: అనంతపురంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో జరిగే ఎస్సైల పాసింగ్ అవుట్ పరేడ్ లో హోంమంత్రి మేకతోటి సుచరిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ ప్రజలకు సేవలందించడంలో పోలీసులు ఎప్పుడూ ముందు ఉండాలని, ముఖ్యంగా మహిళల విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. న్యాయం కోసం పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన మహిళల కష్టాలను వెంటనే పరిష్కరించాలని పోలీసులకు సూచించారు. ఈ సంవత్సరం ఏపీకి ఐదుగురు ఐపీఎస్ అధికారులతో పాటు 25 మంది యువ డీఎస్పీలు, 1591 మంది కానిస్టేబుల్స్ శిక్షణ పూర్తి చేసుకొని వచ్చారు. దేశంలోనే తొలిసారి ఏపీ పోలీస్ సేవ యాప్ ద్వారా దాదాపు 87 రకాల సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారని తెలిపారు. ఇప్పటికే దిశ మొబైల్ యాప్ ను దాదాపు 11 లక్షల మంది డౌన్ లోడ్ చేసుకున్నారు.. అత్యంత అధునాతన సౌకర్యాలతో దిశ బస్ లను కూడా తీసుకురావడం జరిగింది అని అన్నారు. అన్ని సందర్భాలలో ఫ్రెంట్ లైన్ వారియర్స్ గా పేరుపొందిన పోలీస్ సిబ్బంది సంక్షేమానికి కట్టుబడి ఉన్నాము. ప్రజా రక్షణ విషయంలో ప్రభుత్వం ఎక్కడా రాజీ పడకుండా పనిచేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీజీపీ గౌతమ్ సవాంగ్, అడిషనల్ డీజీపీ రవి శంకర్ అయ్యర్, డిఐజి క్రాంతి రానా టాటా, ఇతర పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: ప్రజలకు సేవలందించడంలో పోలీసులు ముందుండాలి: హోంమంత్రి సుచరిత Rating: 5 Reviewed By: NEWS UPDATE