728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
September 25, 2020

బాలుడి హత్య కేసును ఛేదించిన పోలీసులు

నాదెండ్ల: మండలంలోని గోరిజివోలు గ్రామంలో దావల యశ్వంత్(8) అనే బాలుడిని కొట్టి కొట్టి చంపి గోతంలో బాలుడి మృతదేహాన్ని పెట్టి అలుగు వాగులో పడవేసిన కేసులో పల్లపు వీరస్వామిను గొరిజివోలు గ్రామంలో పోలీసులు అరెస్టు చేశారు. వీరితోపాటు వీరస్వామి భార్య కోటేశ్వరమ్మను కూడా అరెస్టు చేసి వీరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ మరియు హత్య సెక్షన్ లతో కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచారు.

ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాల ప్రకారం నాదెండ్ల మండలంలోని గొరిజవోలు గ్రామంలో తన కుమారుడు యశ్వంత్(8) కనిపించట్లేదని నాదెండ్ల పోలీస్ స్టేషన్లో ఈ నెల 19వ తేదీన దావల లక్ష్మి ఫిర్యాదు చేసింది. సుమారు ఒక సంవత్సరమునర క్రితం పాలపాడు నుంచి వచ్చిన లక్ద్మీ గొరిజవొలు గ్రామంలో వుంటూ వీరాస్వామితో సహజీవనం కొనసాగిస్తోంది. అయితే కొద్ది రోజుల క్రితం లక్ష్మికి పాము కాటు వేయడంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో ఉంటూ శుక్రవారం రాత్రి ఇంటికి రాగా తన కుమారుడు కనిపించకపోవడంతో తన కుమార్తె(6) వీరస్వామి తన అన్న యస్వంత్ ను కొట్టి తీసుకెళ్లినట్లు కుమార్తె చెప్పటంతో దావల లక్ష్మీ తన మేనమామ అయిన పల్లపు వీరస్వామి తన కుమారుడిని తీసుకెళ్లినట్లు నాదెండ్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.

నరసరావుపేట డీఎస్పీ వీరారెడ్డి ఆధ్వర్యంలో ఈ కేసు విచారణ చేస్తుండగా పల్లపు వీరాస్వామి అలుగు వాగు సమీపంలో తన బైక్ వదిలి పోగా ఆ దిశగా పోలీసులు బాలుని ఆచూకీ కోసం గాలించగా 20వ తేదీన అలుగు వాగు దగ్గర గోతంలో యస్వంత్ మృతదేహన్ని కనుగొన్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహం యశ్వంత్ తల్లి లక్ష్మికి అప్పగించారు. ఈ కేసును నరసరావుపేట డీఎస్పీ వీరారెడ్డి ఆధ్వర్యంలో రూరల్ సి ఎం సుబ్బారావు, రూరల్ ఎస్.ఐలు బాలకృష్ణ, భాస్కర్, నాదెండ్ల ఎస్ఐ నారాయణ రెడ్డి తదితర సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి వీరస్వామిను అరెస్టు చేసినట్లు సీఐ సుబ్బారావు తెలియజేశారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: బాలుడి హత్య కేసును ఛేదించిన పోలీసులు Rating: 5 Reviewed By: NEWS UPDATE