చిలకలూరిపేట: ప్రజలు అధికారులకు రోజువారీ ఇచ్చే లంచం నుండి విముక్తి చేయాలని ప్రభుత్వ ఉద్యోగులు లంచం తీసుకోకుండా స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని లోక్ సత్తా పార్టీ నాయకులు భాను ప్రసాద్ తదితరులు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి లేఖ రాశారు. ఈ సందర్భంగా వారు చిలకలూరిపేటలోని వివేకానంద విగ్రహం వద్ద నిరసన తెలియజేస్తూ గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో అనేక ఆఫీసుల్లో లంచాలు తీసుకుంటున్నారని ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాలంటే భయంగా ఉందని వారు తెలియజేశారు. అవినీతి అధికారుల యొక్క ఆస్తులను జప్తు చేసి లంచగొండితనాన్ని నిర్మూలించాలని, లంచగొండి అధికారులని పట్టించిన వారికి రక్షణ కల్పించి వారికి కూడా రివార్డులు అందజేయాలని ఈ సందర్భంగా వారు కోరారు. ఈ కార్యక్రమంలో లోక్ సత్తా నాయకులు భాను ప్రసాద్, మురికిపూడి ప్రసాద్, కృష్ణ ప్రసాద్, భాస్కరరావు హరి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.