చిలకలూరిపేట: పట్టణంలో బుధవారం ఉదయం 10:30 గంటలకు రజక కాలనీ లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కోవిడ్-19 పరీక్షలు నిర్వహిస్తున్నట్లు నోడల్ అధికారి డాక్టర్ గోపీనాయక్ తెలియజేశారు. ఈ పరీక్షలను మున్సిపల్ కమిషనర్, తహసిల్దార్, అర్బన్ పోలీసులు కూడా పర్యవేక్షిస్తారని తెలిపారు. కోవిడ్ పరీక్షలు చేయించుకునే వారు తమ ఆధార్ కార్డు తప్పనిసరిగా తీసుకురావాలని.. కరోనా లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా పరీక్షలు చేయించుకోవచ్చు అని తెలిపారు.