728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
September 3, 2020

ఏపీ సర్కారుకు సుప్రీంకోర్టులో మరోసారి చుక్కెదురు

న్యూఢిల్లీ:
★ ఆంగ్ల మాధ్యమంపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన సుప్రీం ధర్మాసనం.

★ కేసులో ప్రతివాదులకు నోటీసులు జారీచేసిన సుప్రీం కోర్టు.

★ తదుపరి విచారణ సెప్టెంబర్ 25కు వాయిదా.

వాదనలు...
★ రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదనలు వినిపిస్తున్న సీనియర్ న్యాయవాది కేవీ విశ్వనాధన్.

★ నోటీసులు జారీ చేస్తామన్న సుప్రీంకోర్టు ధర్మాసనం.

★ నోటీస్ తో పాటు హైకోర్టు తీర్పుపై స్టే కూడా ఇవ్వాలని కోరిన రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది.

★ విద్యా హక్కు చట్టంలో మాతృభాషలోనే విద్యాబోధన జరగాలన్న నిబంధన ఏమీ లేదన్న సీనియర్ న్యాయవాది విశ్వనాథన్.

★ విద్యా బోధన ఇంగ్లీష్ మీడియంలో జరగాలన్న రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం ప్రగతిశీల నిర్ణయమని వాదించిన విశ్వనాథన్.

★ తెలుగు మీడియం విద్యా బోధన వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు శాతం తీవ్రంగా తగ్గిపోతుందన్న న్యాయవాది విశ్వనాథన్.

★ ప్రతివాదుల తరపు వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది శంకర్ నారాయణన్.

★ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం విద్యార్థులు తెలుగు మీడియం ఎంచుకునే అవకాశాన్ని కాలరాస్తుందని శంకర్ నారాయణన్ వాదనలు.

★ తెలుగు మీడియం పాఠశాల పూర్తిగా కనుమరుగు చేసే ప్రతి ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నదని ప్రతివాదుల తరఫు న్యాయవాది.

★ హైకోర్టు తీర్పు విద్యార్థుల మాతృ భాష నేర్చుకునే హక్కులను కాలరాస్తున్న శంకర్ నారాయణన్.

★ ప్రతివాదులు అఫిడవిట్ దాఖలు చేసిన తర్వాత స్టే అంశాన్ని పరిశీలిస్తామన్న సుప్రీంకోర్టు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: ఏపీ సర్కారుకు సుప్రీంకోర్టులో మరోసారి చుక్కెదురు Rating: 5 Reviewed By: NEWS UPDATE