728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
September 27, 2020

నిరుద్యోగులకు యువజన మాసపత్రికతో ఉద్యోగ అవకాశాలు

గుంటూరు: నిరుద్యోగ యువతకు మార్గదర్శి "యువజన మాస పత్రిక" ఆవిష్కరించిన నేతలు నిరుద్యోగ యువతకు “యువజన మాసపత్రిక" మార్గదర్శిగా ఉపయోగ పడుతుందని CPI జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, AIYF రాష్ట్ర కార్యదర్శి నక్కి లెనిన్ బాబు పేర్కొన్నారు. AIYF ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో పునఃప్రచురించిన AIYF యువజన మాసపత్రికను గుంటూరులోని మల్లయ్య లింగం భవన్ లో యువజన మాస పత్రిక ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా నక్కి లెనిన్ బాబు, జంగాల అజయ్ కుమార్ మాట్లాడతూ యువజన మాస పత్రిక ఫునః ప్రచురణ చేయడం శుభ పరిణామం అని, యువజన మాసపత్రికలో నిరుద్యోగ యువతకు ఉపయోగ పడే విధంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, పోటీ పరీక్షలకు అవసరం అయిన మెటీరియల్స్, జాబ్ వేకెన్సీస్ తో పాటు అనేక సామాజీక, రాజకీయ, సాంస్కృతిక అంశాలతో కూడినటువంటి మాస పత్రిక ప్రచురణ జరుగుతుందని, విద్యార్థులు పెద్దఎత్తున యువజన మాస పత్రికను ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పరుచూరి రాజేంద్ర బాబు ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి షేక్. సుభాని, జిల్లా అధ్యక్షులు చల్లా, మరియదాసు, వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: నిరుద్యోగులకు యువజన మాసపత్రికతో ఉద్యోగ అవకాశాలు Rating: 5 Reviewed By: NEWS UPDATE