728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
September 27, 2020

వైసీపీ ప్రభుత్వం సమాధులను కూడా వదలడం లేదు: టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ

చిలకలూరిపేట: పట్టణంలోని జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న దళిత స్మశాన వాటికలోని సమాధులను మున్సిపల్ అధికారులు ఈనెల 24వ తేదీన పడగొట్టించిన విషయం మీద తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు నిజ నిర్ధారణ కమిటీని ప్రకటించారు. ఈరోజు చిలకలూరిపేట పట్టణంలోని దళిత సమధుల వద్దకు టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ సభ్యులు వచ్చారు. అయితే పోలీసులు వారిని రాకుండా ఎడ్లపాడు వద్ద కొంతసేపు అడ్డుకున్నారు. అయితే, టీడీపీ నాయకుడు మాజీ మంత్రి నక్కా ఆనందబాబుకు పోలీసులకు కొంత వాగ్వాదం జరిగిన అనంతరం వారు వారిని పోనివ్వడంతో నక్కా ఆనంద్ బాబు ఆధ్వర్యంలో నిజనిర్ధారణ కమిటీ సభ్యులు మద్దిరాల మ్యాని, పిల్లి మాణిక్యాల రావు, మానుకొండ శివప్రసాద్, దేవ తోటి నాగరాజులు చిలకలూరిపేట స్మశాన వాటికకు చేరుకొని సమాధులను పడగొట్టిన తీరును స్థానిక దళిత నేతలను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం మాజీ మంత్రి కమిటీ సభ్యులు నక్కా ఆనందబాబు మాట్లాడుతూ దళితుల స్మశాన వాటికలోని సమధులను పడగొట్టడం అత్యంత హేయమైన చర్య అని అన్నారు. చనిపోయిన వారు మరల తిరిగి లేచి వస్తారనే నమ్మకంతో పూడ్చి పెడతారని అటువంటి సమాధులను కూల్చివేసి, హిందూ సాంప్రదాయ ప్రకారం విద్యుత్ దహన వాటికను ఏ విధంగా ఇక్కడ ఏర్పాటు చేస్తారని ప్రశ్నించారు. ఇంతకూ ఈ సమాధులను పడగొట్టిన వారెవరో ముందు ప్రభుత్వం తేల్చాలని అన్నారు. ప్రభుత్వం ఓ పక్క హిందూ దేవాలయాలను, మరోపక్క దళిత సమాధులను కూడా పడగొట్టిచడం వైసీపీ ప్రభుత్వంకే సాధ్యమవుతుందని ఆనంద్ బాబు మీడియాకు వివరించారు. దళిత స్మశాన వాటిక ఆక్రమణకు గురైందని సమగ్ర సర్వే చేయించి ఇందుకు బాధ్యులైన అధికారులను ప్రభుత్వం వెంటనే సస్పెండ్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వీరి వెంట స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు పిల్లి కోటి, జగదీష్, రవి, సత్యనారాయణ, మదన్, కరిముల్లా, సమద్ ఖాన్, అజారుద్దీన్, అజర్ తదితరులు ఉన్నారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: వైసీపీ ప్రభుత్వం సమాధులను కూడా వదలడం లేదు: టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ Rating: 5 Reviewed By: NEWS UPDATE