728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
September 23, 2020

చిలకలూరిపేట: నిషేధిత చేపలను (క్యాట్ ఫిష్) పెంచుతున్న ముఠా

చిలకలూరిపేట: మండల పరిధిలోని బొప్పూడి పరిసర ప్రాంతాల్లో, చిలకలూరిపేట జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ వెనుక మాఫియా గుట్టుచప్పుడు కాకుండా తన పని తాను కొనసాగిస్తూనే ఉంది. అత్యాశతో అతి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు అని భావించిన కొందరు ప్రభుత్వం నిషేధించిన క్యాట్ ఫిష్ మరియు ఫంగస్ చేపలను చెరువులలో పెంచి, ఓగేరు వాగులోని నీటిని చెరువులలో నింపి క్యాట్ ఫిష్ పిల్లలను చేరువుల్లో గుట్టుగా వేసి వాటిని పెంచి అక్రమంగా అమ్మి సొమ్ము చేసుకుంటున్న వైనమిది.భారత ప్రభుత్వం క్యాట్ ఫిష్ లను నిషేధించింది. ఈ క్యాట్ ఫిష్ తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ రావడం, రక్తం గడ్డ కట్టడం, కార్డియాక్ అరెస్ట్ లాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని 2వేల ఫిర్యాదులు ప్రభుత్వానికి రావటంతో ఈ క్యాట్ ఫిష్ పెంపకాన్ని కేంద్ర ప్రభుత్వం నిషేధించింది.

అయితే ఉభయగోదావరి జిల్లాలకు చెందిన కొందరు చిలకలూరిపేట మండల పరిధిలోని బొప్పూడి పరిసర ప్రాంతాల్లో ఒక వ్యక్తివి రెండు, ఇంకో వ్యక్తివి 14, మరి కొంత మందితో కలిపి మొత్తం 30 వరకు చెరువులను లీజుకు తీసుకొని గుట్టు చప్పుడు కాకుండా కొన్ని చెరువులలో క్యాట్ ఫిష్ లను, కొన్ని చెరువులో ఫంగస్ చేపలను వేసి పెంచుకుంటున్నారు. ఈ క్యాట్ ఫిష్ పెంపకం దారులకు కొంత మంది పెద్దల, అధికారుల అండదండలు కూడా మెండుగా ఉన్నట్లు విశ్వాసనీయంగా తెలుస్తుంది. అయితే క్యాట్ ఫిష్ లు పూర్తిగా పెరగాలి అంటే 6 నెలల సమయం పడుతుంది, వీటికి ఆహారంగా కుళ్ళిపోయిన మరియు కోళ్లకు సంబంధించిన వేస్ట్ మాంసాన్ని, కొవ్వును తెచ్చి కొంత ఉడకబెట్టి ఒక యంత్రం ద్వారా చెరువులో వేస్తారు. ఈ వేస్ట్ కొవ్వు, మాంసం వల్ల 6 నెలల్లో పెరగవల్సిన చేప కేవలం రెండు మూడు నెలల్లోనే పెద్దదవుతుంది. ఈ యొక్క క్యాట్ ఫిష్ చేపలను మహారాష్ట్రకు, ఇతర రాష్టాలకు ఎగుమతి చేస్తూ ఉంటారు.

గత సంవత్సరం అదిలాబాదులో క్యాట్ ఫిష్ తీసుకెళ్తున్న ఒక ట్రక్ బోల్తా పడటంతో, కోట్లాది రూపాయల విలువ చేసే క్యాట్ ఫిష్ ఇతర రాష్ట్రాలకు రవాణా చేస్తున్నట్లు ప్రభుత్వం గుర్తించి వారిపై కేసులు నమోదు చేసింది. ఈ వ్యవహారం బయటపడటంతో ఉభయగోదావరి జిల్లాలకు చెందిన కొందరు రైతులు గత రెండేళ్లుగా చిలకలూరిపేట బొప్పూడి పరిసర ప్రాంతాల్లోని కొంతమంది వ్యక్తుల వద్ద చెరువులను లీజుకు తీసుకొని గుట్టుచప్పుడు కాకుండా అధికారుల కళ్లుగప్పి క్యాట్ ఫిష్, ఫంగస్ చేపలను చెరువులలో పెంచుతున్నారు. క్యాట్ ఫిష్ ఇతర దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్యాట్ ఫిష్ ను ప్రోటీన్, ఒమేగా, బి 12 విటమిన్స్ తయారు చేసే మందుల్లో వాడతారని కూడా వైద్య నిపుణులు చెబుతున్నారు.

అయితే ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు నిద్ర నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కొందరు వ్యక్తులు ఫిషరీస్ డిపార్ట్మెంట్కు ఫిర్యాదు చేయగా సదరు నరసరావుపేటకు చెందిన ఫిషరీస్ అధికారి బొప్పూడి పరిసర ప్రాంతం చెరువుల్లో ఉన్న క్యాట్ ఫిష్ పెంపకాన్ని నిలిపివేయాలని.. ఈ ప్రాణాంతకమని క్యాట్ ఫిష్ ను గుంత తీసి గుళికలు, ఎండ్రిన్ వేసి పూర్తిగా పూడ్చి వేయవలసిందిగా ఈ నెల 15వ తేదీన క్యాట్ ఫిష్ పెంచుతున్న వారికి నోటీసులు జారీ చేశారు. నోటీస్ ప్రకారం ఈ క్యాట్ ఫిష్ ఎంత ప్రమాదకరమో అర్థమవుతుంది కదా. మనుషుల ప్రాణాలతో చెలగాటం ఆడే ఇటువంటి క్యాట్ ఫిష్ చెరువులను ప్రభుత్వ అధికారులు ధ్వంసం చేసి ఇక్కడ క్యాట్ ఫిష్ పెంపకం లేకుండా చేయాలని పలువురు కోరుతున్నారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట: నిషేధిత చేపలను (క్యాట్ ఫిష్) పెంచుతున్న ముఠా Rating: 5 Reviewed By: NEWS UPDATE