చిలకలూరిపేట: ప్రస్తుతం దేవాలయాలలో దొంగతనాలు, విగ్రహాలు పగలగొట్టడం, విలువైన వస్తువుల్ని నాశనం చేయటం లాంటి సంఘటనలు జరుగుతున్నాయి. కావున పట్టణంలో ఎవరైనా కొత్త వ్యక్తులు కనిపించిన, లేదా ఎవరైనా అనుమానంగా తిరుగుతూ కనిపించిన వెంటనే చిలకలూరిపేట టౌన్ పోలీస్ శాఖ వారికి సమాచారం ఇవ్వాలని పట్టణ సీఐ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తద్వారా ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడే వ్యక్తులమీద కఠిన చర్యలు తీసుకోబడును. ముఖ్యంగా టౌన్ పరిధిలోని దేవాలయాలు, మసీదులు, చర్చిల దగ్గర కాపలా దారులని లేదా cc కెమెరాలని ఏర్పాటు చేసుకోవాలి. అనుమానిత వ్యక్తులు ఎవరైనా సంచరిస్తున్న, కొత్త వారు అదేపనిగా వీధుల్లో తిరుగుతుంటే 7901677103, 9440796178 నంబర్లకు సమాచారాన్ని ఇవ్వాలని పట్టణ సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు.
September 22, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట వాసులకు విజ్ఞప్తి
Rating: 5
Reviewed By: NEWS UPDATE

