728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
September 22, 2020

ఉచిత విద్యుత్ పథకాన్ని కొనసాగించాలి: సిపిఎం

చిలకలూరిపేట: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా స్థానిక కళామందిర్ సెంటర్ వద్ద సిపిఎం పట్టణ కార్యదర్శి పేరు బోయిన వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం డిప్యూటీ తాసిల్దార్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పశ్చిమ గుంటూరు జిల్లా కార్యవర్గ సభ్యులు వై.రాధాకృష్ణ పాల్గొని మాట్లాడుతూ ఆదాయపు పన్ను పరిధిలో లేని ప్రతి కుటుంబానికి ఆరు నెలలపాటు రూ.7500 ఇవ్వాలని, అలానే ప్రతి కుటుంబ సభ్యులకి 10 కేజీల బియ్యం మరియు నిత్యావసర సరుకులు ఇవ్వాలని, గ్రామీణ ఉపాధి హామీ పథకం పట్టణాల్లో కూడా వర్తింపజేసి పనిదినాలను 200 రోజులకు పెంచి రోజుకు 600 రూపాయలు వేతనం ఇవ్వాలని, కేంద్ర ప్రభుత్వ షరతుల మేరకు అమలు చేస్తున్న వ్యవసాయ పంపుసెట్లకు మీటర్ల బిగింపు, నగదు బదిలీ పథకాన్ని రద్దు చేసి ఉచిత విద్యుత్ పథకాన్ని కొనసాగించాలని... లాక్ డౌన్ వల్ల ఉపాధి కోల్పోయి ఇబ్బందిపడుతున్న రిక్షా కార్మికులు మరియు భవన నిర్మాణ కార్మికులకు తక్షణమే 10 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం సీనియర్ నాయకులు పోపూరి సుబ్బారావు, సాతులూరి బాబు, కౌలు రైతు సంఘం నాయకులు సాతులూరి లూధర్, ఆటోడ్రైవర్ వర్కర్స్ యూనియన్, పట్టణ రిక్షా వర్కర్స్ యూనియన్, మరియు భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: ఉచిత విద్యుత్ పథకాన్ని కొనసాగించాలి: సిపిఎం Rating: 5 Reviewed By: NEWS UPDATE