యద్దనపూడి: ఆన్ లైన్ మోసాలు పెరిగిపోతున్నాయని, ఎవరైనా మీ అకౌంట్ బ్లాక్ అయిందని బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నాము అని మీ ఆధార్ కార్డు, మీ అకౌంట్ నెంబరు చెప్పండి అని అడిగిన చెప్పవద్దని యద్దనపూడి ఎస్ఐ జీ.వి.చౌదరి తెలిపారు. కొంతమందికి విదేశాల నుండి డబ్బు వచ్చిందని ఆ డబ్బు తీసుకోవాలి అంటే మీరు మాకు కొంత చార్జీ చెల్లించాల్సి వస్తుందని.. ఈ విధంగా కూడా మోసాలు చేస్తున్నట్లు వారు వివరించారు. గూగుల్ పే ద్వారా పొరపాటున మాకు రావలసిన డబ్బు మీకు వచ్చిందని ఆ వచ్చిన డబ్బులు మాకు పంపమని ఇలా అనేక రకాలుగా ఆన్ లైన్ మోసాలు చేస్తున్నారని, ఇటువంటి మోసాలు జరుగకుండా మండల ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్ఐ వివరించారు. బ్యాంకు నుండి మాట్లాడుతున్నామని ఎవరైనా తమ పాస్వర్డ్, బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డు నంబర్లు అడిగిన ఇవ్వవద్దని, ఎవరికైనా అనుమానం వస్తే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయవలసిందిగా ఎస్ఐ జీవి చౌదరి తెలియజేశారు.