728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
September 2, 2020

చిలకలూరిపేట: వాలంటీర్ నిర్వాకం... ఎస్టీ ధ్రువపత్రంతో అనర్హుడికి పింఛన్

చిలకలూరిపేట: పేట నియోజకవర్గం నాదెండ్ల మండలంలో తప్పుడు కుల ధ్రువీకరణ పత్రంతో ఒక వ్యక్తి  వృద్ధాప్య పెన్షన్ పొందడానికి నాదెండ్ల వాలంటీర్లు బి.మనోహర్ పథకాన్ని రచించాడు. మార్టూరు మండలం రాజుపాలెం గ్రామానికి చెందిన భూపతి శ్రీను (54) నాదెండ్లలోని వాలంటీర్ మనోహర్ ఇంట్లో కొంత కాలం నుంచి అద్దెకు వుంటున్నారు. అతనికి పెన్షన్ వచ్చేలా చేయాలని వాలంటీర్ మనోహర్ భావించాడు. వైయస్సార్ చేయూత పథకంలో దరఖాస్తులు పెట్టుకునే సమయంలో అతనికి పింఛను వచ్చేలా చేయడానికి ఇతర సామాజిక వర్గానికి చెందిన అతని పేరుమీద ఎస్టి కుల ధ్రువీకరణ పత్రాన్ని నాదెండ్ల తహసిల్దార్ కార్యాలయం నుంచి వాలంటీర్ మనోహర్ ఎస్టీ సర్టిఫికెట్ వచ్చేలా చేసాడు.

అయితే ఇతని పేరు మీద రూ.2,250 వైఎస్సార్ పెన్షన్ రావడంతో తక్కువ వయస్సు గల అతనికి వైయస్సార్ పెన్షన్ ఏ విధంగా వచ్చిందని గ్రామస్తులు ఆరా తీశారు. పంచాయతీ కార్యదర్శికి ఈ విషయం ఫిర్యాదు చేయగా సదరు దరఖాస్తుదారు భూపతి శ్రీను ఎస్టీగా సర్టిఫికెట్ ఉన్నట్లు తెలియటంతో ఈ విషయాన్ని రెవెన్యూ అధికారులకు, ఫిర్యాదు వెళ్ళింది.

అయితే వైఎస్సార్ చేయూత పథకం సంబంధించి మంగళవారం ముగ్గురు ఎంపిడిఓ తొలగించిన విషయం విదితమే తొలగించిన జాబితాలో కూడా మనోహర్ ఉన్నారు. ఎస్టీ ధ్రువీకరణ పత్రం గురించి నాదెండ్ల తాసిల్దార్ సాంబశివరావు వివరణ కోరగా వైయస్సార్ చేయూత పథకంలో దరఖాస్తు చేసుకున్నారని సమయం లేక విచారణ జరపకుండా సంతకాలు చేయడం జరిగిందని భూపతి శ్రీనివాసరావు ఎస్టీ సర్టిఫికెట్ను రద్దు చేసినట్లు తాసిల్దార్ సాంబశివరావు తెలియజేశారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట: వాలంటీర్ నిర్వాకం... ఎస్టీ ధ్రువపత్రంతో అనర్హుడికి పింఛన్ Rating: 5 Reviewed By: NEWS UPDATE