చిలకలూరిపేట: 2004 నుండి 2014 వరకు నాటి కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉన్నందున రాజనీతిజ్ఞులు పాలనానుభవం గల పెద్దలు కవులు కళాకారులు ఒప్పుల కొప్పు ఒయ్యారి భామతో పోలిస్తే నిన్నటి తెలుగు దేశం నేటి వైకాపాల పాలనలో అప్పుల కుప్ప అయ్యో రామ అన్నట్లు దిగజారిపోయిందని చిలకలూరిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి యం రాధాకృష్ణ అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకోకుండా ఇబ్బడి ముబ్బడిగా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ఆర్ధిక వ్యవస్థ మీద మోయలేని భారం మోపుతున్నారని ప్రభుత్వం డబ్బుతో ఓట్లు కొనుగోలు చేయాలనే దురాలోచనతో ఆర్ధిక వ్యవస్థ నడ్డి విరుస్తున్నారని అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి మానసపుత్రికగా భావించి తొలి సంతకంతో ఉచిత విద్యుత్ నందించి రైతుల జీవితాల్లో వెలుగులు నింపితే నేటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం విడుదల చేసిన జివో 22తో ఉచిత విద్యుత్ పథకం నీరు కారిపోయింది అన్నారు.
September 13, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: ‘డబ్బుతో ఓట్లు కొనుగోలు చేయాలనే అలా చేస్తున్నారు'
Rating: 5
Reviewed By: NEWS UPDATE

