728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
September 4, 2020

చిలకలూరిపేటలో ఆకాశాన్నంటుతున్న కూరగాయల ధరలు

చిలకలూరిపేట: ఏమి కొనలేము.. ఏమి తినలేము అనే చందాన ఉంది మధ్యతరగతి కుటుంబాల పరిస్థితి. అసలే కరోనాతో పనులు లేక అల్లాడుతున్న జనానికి కూరగాయల ధరలకు రెక్కలొచ్చి ఆకాశాన్నంటుతున్నాయి. అవి ముట్టుకోకుండానే షాక్ కొట్టి నట్టు ఉంది మధ్యతరగతి కుటుంబాల పరిస్థితి. మార్కెట్లో కూరగాయలు కొనాలని రూ.200 తీసుకెళ్తే సగం కవర్ కు కూడా రావడం లేదు. పచ్చిమిర్చి కిలో 100 రూపాయలు, క్యారెట్ 80 రూపాయలు, బంగాళదుంప కిలో 60 రూపాయలు, బెండకాయ, దొండకాయ, వంకాయ కిలో 50 రూపాయలు చొప్పున, క్యాబేజీ కిలో 60 రూపాయలు, మునక్కాయ ఒకటి 15 రూపాయలు, చిక్కుడుకాయలు కిలో 80 రూపాయలు, ఇక ఏదైనా 50 పైన వరకు ధర పలుకుతుంది. కూరగాయలు కొనేవాళ్ళు పావుకేజీ చొప్పున కొంటే 200 రూపాయలు అవుతుంది. ఒక తోటకూర గోంగూర మాత్రమే కట్ట రూ.5 పలుకుతుంది మిగతావన్ని 50 నుండి సామాన్య మధ్యతరగతి మానవులు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేటలో ఆకాశాన్నంటుతున్న కూరగాయల ధరలు Rating: 5 Reviewed By: NEWS UPDATE