‘తాగునీటి సమస్య పరిష్కరించడంలో పేట మున్సిపల్ అధికారులు ఫెయిల్'
చిలకలూరిపేట: పట్టణంలో అమృత పథకకాన్ని నీరుగార్చి చిలకలూరిపేట ప్రజలకు మంచి నీటి ఎద్దడిని తెచ్చారని భాజపా నియోజకవర్గ ఇన్చార్జి అన్నం శ్రీనివాసరావు తెలిపారు. మున్సిపల్ అధికారులు ప్రజల తాగునీటి అవసరాలను తీర్చ వలసినదిగా దానికి 139 కోట్ల కేంద్ర ప్రభుత్వ నిధులను ఉపయోగించుకొని త్వరితగతిన యుద్ధప్రాతిపదికపై పూర్తి చేయాలని వీరు కోరారు. అలా చేయని పక్షంలో చిలకలూరిపేట పట్టణ ప్రజల తరపున భాజపా పార్టీ ఉద్యమానికైనా సిద్ధమని.. కేంద్ర ప్రభుత్వానికి తాము లేఖ రాస్తామని ఈ సందర్భంగా వారు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. వచ్చే నిధులను సద్వినియోగం చేసుకోవటం కూడా ఈ మున్సిపల్ అధికారులకు తెలియదా అని వీరు ప్రశ్నించారు. పట్టణ పురపాలక సంఘం అధికారి పనులు చేయడంలో పూర్తి నిర్లక్ష్యం వహిస్తున్నారని భాజపా నాయకులు అన్నం శ్రీనివాసరావు తెలిపారు.