728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
September 19, 2020

సచివాలయాలను ప్రారంభించిన హోంమంత్రి సుచరిత

గుంటూరు: ప్రత్తిపాడు నియోజకవర్గం పెదనందిపాడు, నాగులపాడులలో గ్రామ సచివాలయాలను హోంమంత్రి మేకతోటి సుచరిత ప్రారంభించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతిఒక్కరికీ చేరేలా సీఎం జగన్ పరిపాలన ఉందని.. దేశంలో ఎక్కడా లేని విధంగా 65 వేల కోట్ల రూపాయలు సంక్షేమం కోసం ఖర్చు చేయడం జరిగిందని హోంమంత్రి అన్నారు. వై.యస్.ఆర్ చేయూత, ఆసరా, పావలా వడ్డీ, ఇలా అనేక పథకాలు మహిళల అభ్యున్నతి కోసం ప్రవేశపెట్టారన్నారు. మహిళలు స్వయం ఉపాధి పథకం ద్వారా తమ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా చేశారని తెలిపారు. అమ్మవడి, విద్యా దీవెన, వసతి దీవెన ఇలా ప్రతి పథకంలోనూ సీఎం మహిళలను భాగస్వామ్యం చేసారని స్పష్టంచేశారు. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, గ్రామాల్లో కొత్తగా రోడ్లు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయన్నారు. టీడీపీ హయాంలో మద్యం ఏరులై పారేది.. ఇప్పుడు మద్యం అమ్మకాలపై కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. సంపూర్ణ మద్యపాన నిషేధం దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని హోంమంత్రి సుచరిత తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్, ఎండీవో, ఏపీఎం, ఇతర అధికారులు, వైస్సార్సీపీ నాయకులు, మహిళలు, లబ్దిదారులు పాల్గొన్నారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: సచివాలయాలను ప్రారంభించిన హోంమంత్రి సుచరిత Rating: 5 Reviewed By: NEWS UPDATE