చిలకలూరిపేట: పట్టణ పరిధిలోని అన్ని దేవాలయాలు, మసీదులు, చర్చిల యొక్క పూజారులు, పాస్టర్లు, ఇమాంలతో అర్బన్ సీఐ వెంకటేశ్వర్లు పోలీస్ స్టేషన్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని ప్రార్థనా మందిరాల్లో, దేవాలయాల్లో తప్పనిసరిగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని ఇది జిల్లా ఎస్పీ ఉత్తర్వులన్నారు. 24 గంటల్లోపు సిసి కెమెరాలు ఏర్పాటు తప్పనిసరిగా చేసుకోవాలని సూచించారు. ప్రతి దేవాలయం ప్రార్థనా మందిరాల్లో వాచ్మెన్ తప్పనిసరిగా నియమించుకోవాలని తెలిపారు. పోలీసులు ప్రతి మూడు గంటలకోసారి వాటిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయనున్నట్లు తెలియజేశారు.