728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
September 9, 2020

చిలకలూరిపేట ఎమ్మెల్యేకు ఫేక్ ఫోన్ కాల్.. మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు కూడా

చిలకలూరిపేట: ప్రజాప్రతినిధులను మోసం చేసే కేటుగాళ్ల అగడాలు ఏ మాత్రం తగ్గడం లేదు. తాజాగా చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజినీకి మంగళవారం ఒక ఫేక్ కాల్ వచ్చింది. సీఎం జగన్ మాట్లాడుతాడని చెప్పి విశాఖకు చెందిన జగ్జీవన్ రామ్ అనే వ్యక్తి ఆమెకు ఫోన్ చేశాడు. అయితే అతడి తీరుపై ఎమ్మెల్యే రజినికి అనుమానం వచ్చింది. దీంతో ఆమె తెలివిగా వ్యవహరించి ఈ విషయం గురించి సీఎంవోలో ఆరా తీశారు. నిందితుడిని పోలీసులకు పట్టించాలని భావించిన ఎమ్మెల్యే జగ్జీవన్ రామ్ తో ఫోన్ లో మాట్లాడుతూనే డీజీపీకి, ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఫోన్ కాల్స్ ఆధారంగా నిందితుడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అతడి మోసాల గురించి విచారణ చేపట్టారు. కడప జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ జకియా ఖానమ్ కు కూడా ఇతనే ఫోన్ చేసినట్టు పోలీసులు గుర్తించారు.

కొద్దిరోజుల క్రితం అనంతపురం జిల్లా కల్యాణదుర్గం వైసీపీ ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్ కు ఓ వ్యక్తి ఫోన్ చేసి నిధుల పేరుతో మోసం చేసే ప్రయత్నం చేశాడు. కేంద్ర ప్రభుత్వ పథకం పేరు చెప్పి మోసానికి పాల్పడే యత్నం చేశాడు. నియోజకవర్గానికి రూ.3 కోట్లు కేంద్రం కేటాయించిందంటూ ఇండస్ట్రీస్ ప్రాజెక్టు డైరెక్టర్ పేరుతో ఎమ్మెల్యేకు శ్రీనివాస్ అనే వ్యక్తి ఫోన్ చేశాడు. లబ్ధిదారుల వాటా కింద 10 శాతం చెల్లిస్తే యూనిట్ కు రూ.25లక్షల రుణం ఇస్తామంటూ హామీ ఇచ్చాడు. అయితే అప్రమత్తమైన మహిళా ఎమ్మెల్యే అనుమానంతో పరిశ్రమలశాఖ అధికారులను ఆరా తీశారు. అలాంటి పథకం ఏదీ లేదని ఉషశ్రీకి అధికారులు తెలిపారు. దీంతో జిల్లా ఎస్పీకి ఎమ్మెల్యే ఉషశ్రీ ఫిర్యాదు చేశారు.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: చిలకలూరిపేట ఎమ్మెల్యేకు ఫేక్ ఫోన్ కాల్.. మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు కూడా Rating: 5 Reviewed By: NEWS UPDATE