చిలకలూరిపేట: ఎమ్మెల్యే విడుదల రజిని ఆదివారం మహిళా సంరక్షణాధికారులతో (మహిళా పోలీసులు) ముఖాముఖీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎలాంటి అసాంఘిక శక్తులకు తావు లేదు అని హెచ్చరించారు. పట్టణ పరిధిలో 29 వార్డ్ సచివాలయల్లో పనిచేస్తున్న మహిళా పోలీసులతో ఎమ్మెల్యే విడదల రజిని ముఖాముఖిగా చర్చించారు. మహిళా పోలీసులు తమ పరిధిలోని ప్రజా సమస్యలను పరిష్కరించటంలో వారి కృషిని అభినందించారు. అంతే కాకుండా విధుల్లో వారు ఎదుర్కుంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు తమ విధి నిర్వహణలో ఇంకా ఏమన్నా ఇబ్బందులు ఉంటె తన దృష్టికి వస్తే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. వార్డుల్లోని శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత మీదే అని ఆ విషయంలో ఎటువంటి వారినైనా ఉపేంక్షించవద్దని హితవు పలికారు. ఈ సందర్భంగా మహిళా పోలీసులు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. పట్టణంలో జరుగుతున్న పేకాట, బాల్యవివాహాలు, అక్రమ మద్యం, గృహహింస, యస్.సి.యస్.టి కేసులు సమస్యలపై మహిళా పోలీసులతో చర్చించి పరిష్కార దిశగా పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ శ్రీనివాసరావు, టౌన్ సిఐ వెంకటేశ్వర్లు, యస్.ఐ రాంబాబు పాల్గొన్నారు.