చిలకలూరిపేట: రాష్ట్ర మరియు జిల్లా పోలీస్ అధికారుల సూచనల మేరకు చిలకలూరిపేట అర్బన్ పోలీస్ స్టేషన్లో అర్బన్ సిఐ వెంకటేశ్వర్లు పట్టణ ప్రాంతంలోని దేవాలయ పూజారులతో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అంతర్వేదిలో జరిగిన ఘటన అనంతరం రాష్ట్రంలో ప్రతి దేవాలయంపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు.. అలానే చిలకలూరిపేట పట్టణంలోని దేవాలయాల్లో సీసీ కెమెరాలు తప్పకుండా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఏవైనా అనుమానిత సంఘటనలు జరిగితే వెంటనే పట్టణ పోలీస్ స్టేషన్లో తెలియజేయాలని అన్నారు.
September 13, 2020
- Blogger Comments
- Facebook Comments
Item Reviewed: దేవాలయాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు: సీఐ వెంకటేశ్వర్లు
Rating: 5
Reviewed By: NEWS UPDATE

