చిలకలూరిపేట: ప్రతి ఏటా రూ.250 చొప్పున పెన్షన్ పెంచుతామన్న రాష్ట్ర ప్రభుత్వం హామీ మేరకు ఆగష్టు నెల కూడా పెరిగిన పెన్షన్ అందకపోవడంతో సామాజిక పెన్షన్ దారులు నిరాశ చెందారని నాదెండ్ల మండల టీడీపీ అధ్యక్షుడు బండారుపల్లి సత్యనారాయణ అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే సామాజిక పెన్షన్ ను రూ.2000 నుంచి రూ.3000 కు పెంచుతామని జగన్ ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఏటా రూ.250 చొప్పున పెంచి ఇస్తామని తెలిపారు. గతేడాది జూలై 8 పెంచిన రూ.250 కలిపి సామాజిక పెన్షన్ దారులకు రూ.2,250 అందించారు. ఈ ఏడాది ఆగష్టు నెల అయిన పెన్షన్లు ఏ మాత్రం పెంచలేదు. పెంచిన పెన్షన్ ఎప్పుడు ఇస్తారు అని వాలంటరీ, సచివాలయ ఉద్యోగులు అడిగిన సమాధానం లేదని అన్నారు.
గత ప్రభుత్వంలో జాతీయ ఉపాధి హామీ పధకము ద్వారా చేసిన పనులకు సంబంధించిన బిల్లుల గురించి, చిలకలూరిపేట నియోజకవర్గంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణాలు, సిమెంట్ రోడ్లు, స్మశానాలు, డంపింగ్ యార్డులు వంటి పనులు మాజీమంత్రివర్యులు పుల్లారావు సహకారంతో చేయించడం జరిగిందని బండారుపల్లి తెలిపారు. ఇన్ని రోజులు డబ్బులు వచ్చిన కూడా ఇవ్వకుండా ఆపటం వలన నిర్మాణం చేపట్టిన వ్యక్తుల యొక్క కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. ప్రభుత్వం వారు నిధులు విడుదల ఆలస్యం అవడం వల్ల, భవిష్యత్తులో గ్రామాల అభివృద్ధికి ఎవరూ ముందుకు రారని, అభివృద్ధి ఆగిపోతుందని, కాబట్టి తక్షణమే నిధులను విడుదల చేయించాలని కోరారు.