728x90 AdSpace

LOCAL

Advertisement

Advt
FOR ADVERTISEMENTS CONTACT: 9505555100
Latest News
September 2, 2020

ఆ యువతితో సహా కోర్టుకు రండి: ఎస్పీకి హైకోర్టు ఆదేశం

అమరావతి:
★ అనంతపురం జిల్లా ఎస్పీ వ్యక్తిగతంగా గురువారం హైకోర్టుకు హాజరు కావాలని ధర్మాసనం ఆదేశించింది.

★ ఓ యువతిని తమ ముందు ప్రవేశపెట్టాలంటూ న్యాయమూర్తులు జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌, జస్టిస్‌ జె.ఉమాదేవితో కూడిన ధర్మాసనం మంగళవారం స్పష్టం చేసింది.

★ తన భార్యను ఆమె తండ్రి అక్రమంగా నిర్బంధించారని పేర్కొంటూ, ఆ యువతిని కోర్టులో హాజరుపరిచేలా ఆదేశాలివ్వాలంటూ తాడిపత్రి మండలానికి చెందిన ప్రవీణ్‌కుమార్‌రెడ్డి అనే యువకుడు హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

★ ప్రభుత్వ న్యాయవాది వివేకానంద వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్‌ది ప్రేమ వివాహమని, ప్రస్తుతం ఆ యువతి వారి తల్లిదండ్రుల వద్ద ఉంటోందన్నారు.

★ పిటిషన్లోని వివరాల్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. ఆ యువతిని తీసుకొని గురువారం కోర్టుకు రావాలని ఎస్పీని ఆదేశించింది.
Advertisements
  • Blogger Comments
  • Facebook Comments
Item Reviewed: ఆ యువతితో సహా కోర్టుకు రండి: ఎస్పీకి హైకోర్టు ఆదేశం Rating: 5 Reviewed By: NEWS UPDATE